ఎమ్మెల్యేను కలిసిన కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్

PLD: వినుకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం వినుకొండలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన జీవీకి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బ్రహ్మంకు ఎమ్మెల్యే జీవీ శుభాకాంక్షలు తెలిపారు.