బాలికలకు విద్యనే భవిష్యత్తుకు పునాది: మంత్రి
NLG: బాలికలకు విద్యనే భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలకు హాజరై ఆయన మాట్లాడుతూ.. మహిళలు సాధికారత సాధించాలంటే తప్పనిసరి విద్య అవసరమని చెప్పారు. విద్యతో పాటు అనేక అవకాశాలు అందిపుచ్చుకుని అభివృద్ధి చెందవచ్చు అన్నారు.