సిమెంట్ రోడ్డు ధ్వంసంపై రెవెన్యూ అధికారుల విచారణ

సిమెంట్ రోడ్డు ధ్వంసంపై రెవెన్యూ అధికారుల విచారణ

KDP: చాపాడు మండలం తిప్పిరెడ్డిపల్లిలో ఈనెల 19న ఓ వ్యక్తి కారణంగా ధ్వంసమైన సిమెంట్ రోడ్డును సోమవారం వీఆర్వో ఇస్మాయిల్, విలేజ్ సర్వేయర్ విష్ణు పరిశీలించారు. సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిగిన విధానం, సిమెంట్ రోడ్డు నిర్మితమైన స్థలం, దీనిపై ఏర్పడిన సమస్యను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. దళితవాడలో పర్యటించి సిమెంట్ రోడ్డు ధ్వంసంపై దళితులను అడిగి తెలుసుకున్నారు.