కేసరపల్లిలో కస్టమ్స్ కార్యాలయాలకు గ్రీన్‌సిగ్నల్
కృష్ణా: గన్నవరం(M)లోని కేసరపల్లిలో కస్టమ్స్ కార్యాలయాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. MLA యార్లగడ్డ వెంకట్రావు చొరవతో విజయవాడ, గుంటూరులో కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం కేసరపల్లిల 3.84 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.