VIDEO: మొగిలి ఘాట్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

VIDEO: మొగిలి ఘాట్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

CTR: మొగిలి ఘాట్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాలు ప్రకారం.. బంగారు పాళ్యం మండలంలోని మొగిలి ఘాట్ దొర చెరువు వద్ద బెంగళూరు వైపు నుంచి వస్తున్న కారు ముందు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో వినోద్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యప్తు చేస్తున్నారు.