కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు
వనపర్తి జిల్లా కాసింనగర్ తండాకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టౌన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అన్నివిధాలా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రజా పాలనను చూసి పార్టీలోకి చేరారన్నారు.