'శివ' కథపై తనికెళ్ల భరణి ఆసక్తికర వ్యాఖ్యలు
'శివ' సినిమాకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసిన తనికెళ్ల భరణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "మొదట్లో ఈ సినిమాకు కామెడీ స్క్రిప్ట్ రాసి ఇస్తే.. అసిస్టెంట్ డైరెక్టర్లు పడిపడి నవ్వుకున్నారు. కానీ, వర్మ 'ఇదేం కథ? ఒక్క జోక్ కూడా లేకుండా రాసి ఇవ్వు' అన్నాడు. కథ అంతా మార్చి ఇచ్చా. దీంతో ఈ సినిమా ఆడుతుందని నమ్మకం పోయింది. కానీ నాగార్జున మాత్రం కథను బలంగా నమ్మాడు" అని తెలిపాడు.