హాస్టల్‌లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
ATP: నార్పలలోని ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెనూ ప్రకారం ఆహారం అందుతుందా లేదా అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దని ఆదేశించారు. విద్యార్థులు కోరిన అదనపు గదులు, సీసీ కెమెరాలు, వీధి దీపాల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.