యాదగిరిగుట్టలో అంగన్వాడీలకు మొబైల్స్
BHNG: యాదగిరిగుట్టలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ సూపర్ వైజర్లు, టీచర్లకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఫోన్లను పంపిణీ చేశారు. డిజిటల్ సేవలతో అంగన్వాడీల పనితీరు మరింత మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.