ఎన్నికల ఎఫెక్ట్: గ్రామాల్లో సందడి వాతావరణం
BDK: స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఉద్యోగం, ఉపాధి కోసం వేరే ఊళ్లు, పట్టణాలు వెళ్లిన వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఊరి బాట పట్టారు. దీంతో గ్రామాల్లో బంధుమిత్రుల కలయికలు, ఆత్మీయ పలకరింపులతో కోలాహలం నెలకొంది. కాగా, ఇప్పటికే మొదటి విడత ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే.