వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: కొండా సురేఖ
TG: జడ్చర్ల పోలేపల్లిలో అక్రమంగా పారిశ్రామిక వ్యర్థాలను పారబోయడంపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. MLA ఫిర్యాదు చేసినా స్పందించని అధికారుల తీరును తప్పుబట్టారు. ఈ అంశంపై సమీక్షకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, రెడ్ జోన్ పరిశ్రమల ప్రతినిధులు హాజరుకావాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించబోమని, వ్యర్థాల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.