'నవరాత్రులు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి'

మేడ్చల్: వినాయక చవితి సందర్బంగా న్యూ బోయినపల్లిలోని బాపూజీనగర్ నల్లపోచమ్మ ఆలయం, 6వ వార్డు శివపంచాయతన సీతారామాంజనేయ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విగ్నేశ్వరుడిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హాజరై ప్రత్యేక పూజలు చేసారు. విఘ్నాలు తొలగించే విగ్నేశ్వరుడి నవరాత్రులను భక్తి శ్రద్దలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయని అన్నారు.