పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు

పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు

W.G: గ్రామపంచాయతీ పరిధిలోని పలు కాలనీలు, కాకిలేరు రోడ్డు, చిన్నంవారిపాలెం, ఘంటసాలవారి వీధి, శేఖర్ రెడ్డినగర్ వంటి ప్రాంతాల్లో గత కొన్నాళ్లుగా పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నాయి. స్థానిక పంచాయతీ అధికారులు, విద్యుత్ సిబ్బంది దీనిపై దృష్టి సారించకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పంచాయతీకి ఆర్థిక భారం పెరుగుతుందని ప్రజలు తెలిపారు.