VIDEO: ఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే
మార్కాపురం జిల్లా బస్సు ప్రమాదం జరిగిన స్థలానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హుటాహుటిన చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై ఎమ్మెల్యే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా ఫైర్ సిబ్బంది, వైద్య సిబ్బంది గాయపడిన వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.