మహాసభలను జయప్రదం చేయాలని పిలుపు
KDP: విద్యుత్ రంగ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ఇవాళ పులివెందులలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు కరపత్రం విడుదల చేశారు. ఏప్రిల్ 8న కడపలోని యూటీఎఫ్ భవన్లో నిర్వహించనున్న 3వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.