మల్కాపూర్ పాఠశాలలో ఉపాధ్యాయుల నిరసన

SRD: నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయాలని కోరుతూ కొండాపూర్ మండలం మల్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఉపాధ్యాయులు కోరారు.