జాతీయ రహదారిపై భారీ గుంతలు

WGL: ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి జాతీయ రహదారి 163పై గుంతలు ప్రమాదకరంగా తయారయ్యాయి. గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై తాడ్వాయి వైపు ఉన్న ప్లాంటేషన్ సమీపంలోని కల్వర్టు వద్ద రోడ్డు పొడవున భారీగుంతలు ఏర్పడ్డాయి. గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.