బైక్, ఐచర్ వ్యాన్ ఢీకొని యువకుడు మృతి

బైక్, ఐచర్ వ్యాన్ ఢీకొని యువకుడు మృతి

JGL: మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. బైక్, ఐచర్ వ్యాన్ ఢీకొనడంతో పట్టణానికి చెందిన సాగర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో శివ అనే యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో అతని పరిస్థితి విషమంగా మారింది.