VIDEO: విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే..?
కోనసీమ: అయినవిల్లి సిద్ధివినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. వివిధ సేవల ద్వారా రూ.4,49,242 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 617 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 2,469 మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.