VIDEO: భక్తులతో కిక్కిరిసిన మల్లన్న ఆలయం
SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. బ్రహ్మోత్సవాల్లో చివరి ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారికి తలనీలాలు సమర్పించారు. గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి, బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.