రాష్ట్ర హజ్ కమిటీ సభ్యునిగా బేగ్

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ సభ్యులుగా మార్కాపురానికి చెందిన జనసేన మైనార్టీ నాయకులు మీర్జా ఆబిద్ హుస్సేన్ బేగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తానని మీర్జా ఆబిద్ హుస్సేన్ బేగ్ తెలిపారు. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.