రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే
కోనసీమ: రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అన్ని విధాలా అండగా నిలుస్తుందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. బుధవారం సాయంత్రం ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి, అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మి గ్రామాల్లో నిర్వహించిన 'రైతన్నా మీకోసం' వారోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.