'రెవెన్యూ మేళాను సద్వినియోగం చేసుకోండి'

'రెవెన్యూ మేళాను సద్వినియోగం చేసుకోండి'

WNP: మున్సిపాలిటీలో ఈ నెల 31 వరకు నిర్వహించే రెవెన్యూ మేళాను ప్రజలు ఉపయోగించుకోవాలని కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. ఆస్తి పన్ను మార్పులు, ఇంటి నెంబర్ కేటాయింపు, నీటి పన్ను సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. బకాయిదారులు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.