ఉగాది తరువాత లోకేష్‌ సీఎం అవుతారు: పేర్ని నాని

ఉగాది తరువాత లోకేష్‌ సీఎం అవుతారు: పేర్ని నాని

AP: ఉగాది తరువాత లోకేష్‌ ఏపీకి సీఎం అయ్యే అవకాశం ఉందని మాజీమంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశాన్ని చంద్రబాబు, పవన్ చర్చించుకున్నారని తెలిపారు. తన కుమారుడితో కలిసి పని చేయాలని.. లేకపోతే ఇద్దరం ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుందని పవన్‌కు వివరించారని జోస్యం చెప్పారు. కేంద్ర నిఘా వర్గాల ద్వారా తనకు ఈ విషయం తెలిసిందన్నారు.