సర్పంచ్ భర్తపై దాడి.. ఇద్దరిపై కేసు నమోదు
WGL: వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో సర్పంచ్ భర్తపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. అక్రమ మట్టి తరలింపును అడ్డుకునే సమయంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సర్పంచ్ అనిత భర్త శ్రీకాంత్ పై పిడిగుద్దులు గుద్దుతూ హెల్మెట్‌తో విచక్షణహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై శుక్రవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయిబాబు తెలిపారు.