వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్

మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100 రోజుల కార్యాచరణలో భాగంగా డివిజన్-04లోని శ్రీ లక్ష్మి నగర్ పార్కులో వనమహోత్సవం జరిగింది. కమిషనర్ ఎ. శైలజా, మాజీ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, అధికారులు, కాలనీ ప్రజలు కలిసి మొక్కలు నాటారు. సానిటరీ ఇన్‌స్పెక్టర్ నారాయణ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.