పశువైద్యాధికారికి రాష్ట్ర స్థాయి పురస్కారం

SKLM: మూగజీవాల వైద్య సేవలో విశేష సేవలందించినందుకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన డా.లిఖినేని కిరణ్ కుమార్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పశువైద్యాధికారి పురస్కారం అందుకున్నారు. బుధవారం విజయవాడలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో డైరెక్టర్ దామోదర్ నాయుడు ఆయనకు ఈ అవార్డును శాలువాతో సన్మానించి బహుకరించారు. పశువైద్య రంగంలో చేసిన కృషికి మరింత గుర్తింపు లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు.