పిడుగుపాటుకు వ్యక్తి మృతి

BPT: చిన్నగంజాం గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పొలంలో గేదెలు మేపేందుకు వెళ్లిన సోపిరాల గ్రామానికి చెందిన గడ్డం బ్రహ్మయ్య అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.