ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ప్రయాణికుల దాడి..?
నల్గొండ: చిట్యాల మండలం వెలిమినేడులో రోడ్డుపై అడ్డంగా ఆపిన రెండు కార్ల విషయంలో ఆర్టీసీ డ్రైవర్‌తో కారు ప్రయాణికులు ఘర్షణకు దిగారు. బస్సును కదలకుండా అడ్డుకొని, డ్రైవర్‌పై దాడికి యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి జోక్యం చేసుకుని, పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.