సాఫ్ట్‌వేర్ కంపెనీకి యజమాని అయినా..!
SDPT: హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ గ్రామ పంచాయతీలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాడు. హైదరాబాద్‌లో సొంత సాఫ్ట్‌వేర్ కంపెనీ నడుపుతున్న లావుడ్య రవీందర్.. గ్రామాభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపాడు. ఇవాళ కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో కలిసి నామినేషన్‌ను దాఖలు చేయగా, ఈ పరిణామం గ్రామస్తుల్లో ఆసక్తిని రేపుతోంది.