VIDEO: 'విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలి'

SRPT: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని కోదాడ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ నరేష్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణ పరిధిలోని తమ్మర బండపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డివిజన్ స్థాయి స్కూల్ ఫెడరేషన్ క్రీడలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు గెలుపు ఓటములను క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.