ఈనెల 26 నుంచి దుగ్గిలమ్మ మహా జాతర వేడుకలు

ATP: రాయదుర్గం పట్టణంలో భక్తుల కోరిన కోర్కెలు తీర్చుతున్న మహిమాన్విత దుగ్గిలమ్మ జాతర వేడుకలు ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త లేట్ పి. కృష్ణకుమారి కుమార్తెలు తెలిపారు. మంగళవారం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకోవాలని సూచించారు.