సఫీల్ గూడ చెరువులో గుర్రపు డెక్క తొలగింపు

HYD: సఫీల్ గూడ చెరువులో ప్రత్యేక ఎంటమాలజీ టీం ఆధ్వర్యంలో గుర్రపు డెక్క తొలగింపు చర్యలను గురువారం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. చెరువు నీటి విపరీతలంపై గుర్రపుడెక్క ఆవరించి ఉండటంతో జలచరాలు మరణించడం, పరిసర ప్రాంతాలలో దోమల బెడద విపరీతంగా పెరగడం లాంటి సమస్యలు ఏర్పడుతున్నట్లు స్థానికులు అధికారుల దృష్టికి రాగా.. చర్యలు చేపట్టారు.