రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

MDK: మాసాయిపేట మండలం స్టేషన్ మాసాయిపేట వద్ద ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లాకు చెందిన బోదాసు సాయవ్వ (43) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్టేషన్ మాసాయిపేట సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళలు హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.