త్వరలో అకౌంట్లోకి డబ్బులు

త్వరలో అకౌంట్లోకి డబ్బులు

AP: తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు మంత్రి లోకేష్ ఆమోదం తెలిపారు. విద్యాశాఖపై సమీక్షించిన ఆయన ఈ పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.325 కోట్లు విడుదలను ఆమోదించారు. దీంతో ఈ డబ్బులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమకానున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా 2024-25 ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.