నల్లబల్లెలో అరటి తోట దగ్ధం

KDP: ముద్దనూరు మండలం నల్లబల్లెలో రైతు వాసుదేవ రెడ్డి సాగు చేసిన నాలుగు న్నర ఎకరాల్లో అరటి తోట గురువారం అగ్నికి ఆహుతైంది. బాధిత రైతు వాసుదేవరెడ్డి తెలిపిన వివరాల మేరకు మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో అరటి తోటలో మంటలు వ్యాపించి సుమారు 1,000 చెట్లు దగ్ధమయ్యాయని తెలిపారు. రూ.10లక్షల మేర ఆర్థిక నష్టం జరిగిందని బాధిత రైతు వాపోయారు.