రేపు హ్యాండ్ బాల్ మహిళా జట్టు ఎంపిక

MBNR: ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ మహిళా జట్టుకు ఎంపిక చేపడుతున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ తబియుద్దీన్, శంకర్ నాయక్ తెలిపారు. 20న డీఎస్ఏ మైదానంలో ఉంటుందని ఆధార్ కార్డుతో రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9048585065 నంబరును సంప్రదించాలని కోరారు.