బోథ్‌లో 72వ అఖిల భారత సహకార వారోత్సవం
ADB: బోథ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఇవాళ 72వ అఖిల భారత సహకార వారోత్సవంను ఘనంగా నిర్వహించారు. బోథ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ కదం ప్రశాంత్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం సీఈఓ గోలి స్వామి వైస్ ఛైర్మన్ కోల రాజేశ్వర్, డైరెక్టర్లు గొల్ల రాజు యాదవ్, మనోహర్ జిట్ట, శ్రీనివాస్, లోలవు పోశెట్టి సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.