మేడిగడ్డ బ్యారేజీలో వరద ప్రవాహం తగ్గుముఖం

మేడిగడ్డ బ్యారేజీలో వరద ప్రవాహం తగ్గుముఖం

BHPL: కాళేశ్వరంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 6,21,840 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైనట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 3,70,000 క్యూసెక్కులు తగ్గినట్లు పేర్కొన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.