VIDEO: హోలీ జోష్.. ఫోన్‌పే దావత్!
MHBD: జిల్లా గూడూరు మండలంలోని గ్రామాల్లో యువకులు, మహిళలు హోలీ పండుగను డిజిటల్ శైలిలో జరుపుకుంటున్నారు. దారిన వెళ్లే వాహనదారులను ఆపి హోలీ శుభాకాంక్షలు చెప్పి, చిల్లర కాకుండా ఫోన్ పే క్యూఆర్ కోడ్ స్కానర్లతో డిజిటల్ చందాలు సేకరిస్తున్నారు. దీంతో చిల్లర కష్టాలకు చెక్ పడింది. యువత హోలీ జోష్‌ను డిజిటల్ పద్ధతిలో మరింత ఆసక్తికరంగా మార్చారు.