సత్తెనపల్లిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం

PLD: సత్తెనపల్లి పట్టణ పరిధిలో శుక్రవారం ఉదయం నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సచివాలయ ఉద్యోగస్తులు పాల్గొని పించన్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలో పెన్షన్ దారుల ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేయడంతో, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.