ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

కృష్ణా: పెడనలో ఎరువుల విక్రయాలపై నిఘా పెంచుతూ వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సూర్యశ్రీ ఎంటర్ప్రైజెస్, శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ వంటి ఎరువుల దుకాణాలను పరిశీలించారు. ప్రభుత్వం నియమించిన ధరకే ఎరువులను విక్రయించాలని సూచించారు.