ZPHSలో చదివి JEEలో మెరిసిన విద్యార్థిని
SDPT: నంగునూరుకి చెందిన కోల రాజేశ్వరి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 1250వ ర్యాంక్ సాధించి మెరిసింది. పదో తరగతి వరకు స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో చదివిన ఈమె, హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తి చేసింది. తండ్రి సతీష్ ఆసుపత్రి కాంట్రాక్ట్ ఉద్యోగి కాగా, తల్లి రమాదేవి బీడీలు చుడుతూ కూతురిని చదివించారు.