లీగల్ సర్వీస్‌పై అవగాహన కార్యక్రమం

MBNR: జడ్చర్ల పట్టణ కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కాలేజీలో జూనియర్ సివిల్ జడ్జి నిహారిక ఆధ్వర్యంలో లీగల్ సర్వీస్ అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. విద్యార్థులకు డ్రగ్స్, పోక్సో తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జయ ప్రసాద్, బార్ అడ్వకేట్స్ అధ్యక్షుడు మాలిక్, జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొంగలి శ్రీకాంత్ పాల్గొన్నారు.