తమిళనాడు ఎన్నికల్లో జెసి ప్రభాకర్ రెడ్డి ప్రచారం
ATP: తమిళనాడు ఎన్నికల్లో శోలింగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఏఎం మునిరత్నం గెలుపు కోరుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రచార రంగంలోకి దిగారు. తన మిత్రుడు మునిరత్నం కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో పలువురు ట్రావెల్స్ యజమానులు జేసీని కలిసి ప్రస్తుత రవాణా రంగ పరిస్థితులపై చర్చించారు.