VIDEO: పోలింగ్ కేంద్రాల మార్పు, చేర్పులపై వైసీపీ అభ్యంతరం
TPT: చంద్రగిరి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీల ఓటు హక్కు వినియోగానికి భంగం కలిగించేలా పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులను వెంటనే నిలిపివేయాలని వైసీపీ తరపున చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన నెలవారీ ఎన్నికల సమావేశంలో ఆయన ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ రామ్మోహన్కు వినతి అందించారు.