తాడిపత్రిలో భక్తిశ్రద్ధలతో ఆకాశ దీపోత్సవం
ATP: తాడిపత్రిలోని చింతల వెంకటరమణస్వామి దేవస్థానంలో ఆకాశ దీపోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆకాశ దీపోత్సవం సందర్భంగా దేవస్థానం భక్తుల 'గోవింద గోవిందా' నామస్మరణతో మారుమోగిపోయింది. ఈ వేడుకలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.