' లేడీ డాన్' ఇంట్లో కత్తి లభ్యం!
NLR: పట్టణంలోని హౌసింగ్ బోర్డు ఆర్‌డీటీ కాలనీలో లేడీ డాన్ కామాక్షమ్మ ఇంటిని స్థానికులు సోమవారం రాత్రి కూల్చి వేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు మంగళవారం తనిఖీలు చేసి ఇంటి గోడల్లో దాచిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి కేసుతో పాటు సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో కామాక్షమ్మ అరెస్టైన విషయం తెలిసిందే. గతంలో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ఇక ఆమెను ప్రాంతంలోకి రానివ్వబోమని స్థానికులు హెచ్చరించారు.