బీసీ బిల్లుపై మోదీ జోక్యం చేసుకోవాలి: చామల
TG: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్‌లో ప్రస్తావించారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి పంపిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపేలా ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీల మనోభావాలు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆ బిల్లులను ఆమోదించాలి అని కోరారు.