ఏసీబీ వలలో టౌన్ ప్లానింగ్ అధికారి

ఏసీబీ వలలో టౌన్ ప్లానింగ్ అధికారి

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఆదిభట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ. 75 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.